తెనాలిలో పవన్ కల్యాణ్ పై రాయి విసిరిన వ్యక్తి... పోలీసులకు అప్పగించిన జనసైనికులు
- తెనాలిలో నేడు వారాహి విజయభేరి సభ
- తెనాలి చేరుకున్న పవన్ కల్యాణ్
- వారాహి యాత్రలో రాయి కలకలం
తెనాలి వచ్చిన పవన్ కు జనసేన శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, తెనాలి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్... జనసేనానికి ఆత్మీయ స్వాగతం పలికారు. హెలిప్యాడ్ వద్ద పవన్ కు స్వాగతం పలికిన వారిలో గుంటూరు పార్లమెంటు స్థానం టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఉన్నారు.

