Bullet Train: తూర్పు, ఉత్తర, దక్షిణ భారతావనికి కూడా బుల్లెట్ రైళ్లు: ప్రధాని మోదీ

PM Modi assures Bullet Trains for all four zones in India
  • అహ్మదాబాద్-ముంబయి మార్గంలో బుల్లెట్ రైలు పనులు
  • మిగతా ప్రాంతాలకు కూడా బుల్లెట్ రైలు సేవల విస్తరణకు కట్టుబడి ఉన్నామన్న మోదీ
  • ఇవాళ బీజేపీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా వ్యాఖ్యలు
ప్రస్తుతం అహ్మదాబాద్-ముంబయి మార్గంలో బుల్లెట్ రైలు కారిడార్ పనులు జరుగుతున్నాయి. అయితే, తూర్పు, ఉత్తర, దక్షిణ భారతావనికి కూడా బుల్లెట్ రైళ్లు రానున్నాయని, త్వరలోనే సర్వే ప్రకియ ప్రారంభం అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఇవాళ ఆయన బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన అనంతరం ఈ విషయం తెలిపారు. అహ్మదాబాద్-ముంబయి మార్గంలో బుల్లెట్ రైలు పనులు శరవేగంగా సాగుతున్నాయని, తూర్పు, ఉత్తర, దక్షిణ భారతదేశంలోనూ బుల్లెట్ రైలు సేవలు విస్తరించేందుకు బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అంతేకాదు, వందేభారత్ రైళ్ల సేవలను దేశంలోని ప్రతి మూలకు పొడిగిస్తామని చెప్పారు.
Bullet Train
Narendra Modi
India
BJP

More Telugu News