IPL-2024: ఐపీఎల్: రాజస్థాన్ రాయల్స్ తో పోరులో పంజాబ్ కెప్టెన్ గా శామ్ కరన్

Sam Curran as Captain for Punjab Kings against Rajasthan Royals today
  • నేడు ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ × పంజాబ్ కింగ్స్
  • ముల్లన్ పూర్ లో మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్
ఐపీఎల్ లో ఈ సీజన్ లో దాదాపు ప్రతి మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇవాళ రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ ఛండీగఢ్ సమీపంలో ముల్లన్ పూర్ లో జరుగుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. 

ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ రెగ్యులర్ సారథి శిఖర్ ధావన్ గాయం కారణంగా ఆడడంలేదు. అతడి బదులు ఆల్ రౌండర్ శామ్ కరన్ నాయకత్వం వహించనున్నాడు. శిఖర్ ధావన్ స్థానంలో అథర్వ తైదే తుదిజట్టులోకి వచ్చాడు. డాషింగ్ బ్యాట్స్ మన్ లియామ్ లివింగ్ స్టన్ కూడా పునరాగమనం చేశాడు. 

ఇక, రాజస్థాన్ జట్టులో జోస్ బట్లర్ ఈ మ్యాచ్ కు దూరంగా ఉండనున్నాడు. అతడు 100 శాతం ఫిట్ నెస్ తో లేడని కెప్టెన్ సంజు శాంసన్ వెల్లడించాడు. రోమాన్ పావెల్, తనుష్ కొటియాన్ జట్టులోకి వచ్చారని తెలిపాడు. 

ఈ టోర్నీలో ఇప్పటివరకు రాజస్థాన్ రాయల్స్ జట్టు 5 మ్యాచ్ లు ఆడి 4 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోతంది. పంజాబ్ కింగ్స్ 5 మ్యాచ్ లు ఆడి 2 విజయాలు మాత్రమే సాధించి 8వ స్థానంలో ఉంది.

ఇరు జట్లలో గమనించదగ్గ ఆటగాళ్లు...

రాజస్థాన్ రాయల్స్: సంజు శాంసన్, రియాన్ పరాగ్, హెట్మెయర్, ట్రెంట్ బౌల్ట్, కేశవ్ మహరాజ్, చహల్, అవేశ్ ఖాన్.

పంజాబ్ కింగ్స్: జానీ బెయిర్ స్టో, శామ్ కరన్, లియామ్ లివింగ్ స్టన్, శశాంక్ సింగ్, అర్షదీప్ సింగ్, రబాడా. 

IPL-2024
Rajasthan Royals
Punjab Kings
Sam Curran
Mullanpur

More Telugu News