Ramcharan: ఉపాసన, క్లీంకారతో కలిసి చెన్నై చేరుకున్న రామ్ చరణ్

Ram Charan reaches Chennai
  • చరణ్ కు డాక్టరేట్ ఇవ్వనున్న వేల్స్ యూనివర్శిటీ
  • యూనివర్శిటీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా చరణ్
  • చెన్నై ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ గౌరవ డాక్టరేట్ ను అందుకోబోతున్నారు. తమిళనాడుకు చెందిన వేల్స్ యూనివర్శిటీ ఆయనకు డాక్టరేట్ ఇవ్వనుంది. ఈ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం ఈరోజు చెన్నైలో జరగనుంది. ఈ స్నాతకోత్సవానికి చరణ్ ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. ఈ సందర్భంగా చరణ్ కు గౌరవ డాక్టరేట్ ను అందజేయనున్నారు. చరణ్ కు ఈ అరుదైన గౌరవం దక్కడంతో ఆయన అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. మరోవైపు, ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి రామ్ చరణ్ చెన్నై చేరుకున్నారు. చరణ్ తో పాటు ఆయన భార్య ఉపాసన, కూతురు క్లీంకార కూడా చెన్నైకి వెళ్లారు. ఎయిర్ పోర్టు వద్ద చరణ్ కు ఘన స్వాగతం లభించింది. 
Ramcharan
Tollywood
Chennai
Doctorate

More Telugu News