Hyderabad Metro: అమీర్ పేట్ మెట్రోలో ‘కితాబ్ లవర్స్’ పేరుతో బుక్ ఫెయిర్

Kitab Lovers Book Fair At AmeerPet Metro Station
  • పుస్తక ప్రియులను ఆహ్వానిస్తూ వీడియో ట్వీట్
  • పుస్తకాలను అందరికీ అందుబాటులోకి తేవడమే లక్ష్యమని కామెంట్
  • ఆకర్షణ సతీష్ సంకల్పాన్ని మీరూ అందుకోండని పిలుపు

పుస్తక ప్రియుల కోసం హైదరాబాద్ మెట్రో ప్రత్యేకంగా బుక్ ఫెయిర్ ఏర్పాటు చేసింది. పుస్తకాలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో ‘కితాబ్ లవర్స్’ పేరుతో ఈ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈమేరకు పుస్తక ప్రియులను ఆహ్వానిస్తూ ఓ వీడియోను ట్విట్టర్ లో రిలీజ్ చేసింది. అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో నిర్వహిస్తున్న ఈ బుక్ ఫెయిర్ ను ఆకర్షణ సతీష్ తో కలిసి మెట్రో అధికారులు ప్రారంభించారు.

పుస్తకాలపై ప్రేమ, అందరికీ పుస్తకాలు అందుబాటులో ఉండాలనే తపనతో ఆకర్షణ సతీష్ చిన్ననాటి నుంచే హైదరాబాద్ సహా పలుచోట్ల లైబ్రరీలను ఏర్పాటు చేస్తోంది. దీనికిగాను ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ఆకర్షణ సతీష్ ప్రశంసలు అందుకుంది. ప్రధాని మోదీ తన మన్ కీ బాత్ లో ఆకర్షణ పేరును ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ మెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే పుస్తకాలు అందరికీ అందుబాటులో ఉండాలనే ఆకర్షణ సంకల్పాన్ని మీరూ వినియోగించుకోండి అని హైదరాబాద్ మెట్రో ట్వీట్ చేసింది.

  • Loading...

More Telugu News