Pawan Kalyan: డియర్ వైసీపీ... ఇది మీ సీఎంకు కూడా వర్తిస్తుంది: పవన్ కల్యాణ్

Pawan Kalyan shares satires on jagan
  • విజయవాడ ఎయిర్ పోర్టులో పేపర్ చూస్తున్న ఫొటో పంచుకున్న పవన్
  • ఇది మోదీ హామీ... అవినీతిపరులు జైలుకే అంటూ ఆ పేపర్లో హెడ్డింగ్
  • ఈ హెడ్ లైన్ నా దృష్టిని ఆకర్షించింది అంటూ పవన్ వ్యాఖ్యలు
జనసేనాని పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టు పెట్టారు. ఓ ఆంగ్ల దినపత్రికను చూస్తున్నప్పటి ఫొటో పంచుకున్నారు. ఆ పేపర్లో మోదీ స్పీచ్ తాలూకు బ్యానర్ ఐటమ్ ఉంది. 'ఇది మోదీ హామీ... అవినీతికి పాల్పడిన వారు జైలుకే' అన్నది ఆ పేపర్లోని కథనం శీర్షిక. 

దీనిపై పవన్ స్పందిస్తూ... "విజయవాడ ఎయిర్ పోర్టులో విమానం కోసం వేచిచూస్తుండగా ప్రత్యేకించి ఈ హెడ్ లైన్ నా దృష్టిని ఆకర్షించింది. అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపిస్తామంటూ గౌరవనీయ ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. 

ప్రియమైన వైసీపీ... ఇది మీ సీఎంకు కూడా వర్తిస్తుంది. అయితే నా ప్రశ్న ఏంటంటే... అది ఎన్నికలకు ముందు జరుగుతుందా, లేక ఎన్నికలు అయిపోయాక జరుగుతుందా? వైసీపీ సర్కారును సాగనంపి, బీజేపీ-టీడీపీ-జనసేనతో కూడిన ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని తీసుకువచ్చేందుకు ఏపీ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు" అంటూ పవన్ ట్వీట్ చేశారు.
Pawan Kalyan
Janasena
Jagan
YSRCP
Modi
TDP-JanaSena-BJP Alliance
India

More Telugu News