Hyderabad: అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో హైదరాబాద్

Hyderabad ranks among world top 10 fastest growing cities
  • 'రియల్ ఎస్టేట్: ఎ డికేట్ ఫ్రమ్ నౌ 2024' నివేదిక
  • రియల్ ఎస్టేట్ బూమ్ వల్ల అభివృద్ధి వేగవంతంగా జరుగుతోందని వెల్లడి
  • ఐటీ కారణంగా రియాల్టీ బూమ్ ఉన్నట్లు పేర్కొన్న నివేదిక

ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ టాప్ 10లో చోటు దక్కించుకుంది. నైట్ ఫ్రాంక్ ఇండియా-కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ కలిసి ఓ నివేదికను విడుదల చేశాయి. 'రియల్ ఎస్టేట్: ఎ డికేట్ ఫ్రమ్ నౌ 2024' పేరుతో విడుదల చేసిన నివేదిక... 2019-2035 వరకు హైదరాబాద్ గణనీయమైన అభివృద్ధి సాధించనుందని అంచనా వేసింది. రియల్ ఎస్టేట్ బూమ్ వల్ల అభివృద్ధి వేగంగా జరుగుతోందని పేర్కొంది.

2018లో హైదరాబాద్ 8.47 శాతం అభివృద్దితో స్థూల జాతీయోత్పత్తి 50.6 బిలియన్ల డాలర్లుగా ఉంది. 2035 నాటికి అది 201.4 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. నివేదిక ప్రకారం సూరత్ మొదటి స్థానంలో ఉండగా, ఆగ్రా, బెంగళూరు మూడు స్థానాల్లో ఉన్నాయి. హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచింది. బెంగళూరు, పూణె, హైదరాబాద్ నగరాల్లో ఐటీ కారణంగా రియాల్టీ బూమ్ అధికంగా ఉందని పేర్కొంది. 2004 నుంచి హైదరాబాద్ 4.836 బిలియన్ డాలర్ల పెట్టుబడులను సేకరించినట్లు తెలిపింది.

  • Loading...

More Telugu News