India: ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలకు వెళ్లవద్దని భారతీయులకు విదేశాంగ శాఖ సూచన

  • తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు రెండు దేశాలకు వెళ్లవద్దన్న భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
  • రెండు దేశాల్లోని భారతీయులు జాగ్రత్తలు పాటించాలని సూచన
  • అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరిక
  • ఆయా దేశాల్లోని రాయబార కార్యాలయాలను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచన
ప్రస్తుత యుద్ధ వాతావరణ పరిస్థితి దృష్ట్యా తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలకు వెళ్లవద్దని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం భారతీయులకు సూచించింది. రెండు దేశాల్లో ఉన్న భారతీయులు కూడా జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచన చేసింది. ప్రస్తుతం ఇరాన్ లేదా ఇజ్రాయెల్ దేశాలలో నివసిస్తున్న వారు ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలను సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది.
India
Israel
Iran
MEA

More Telugu News