Tesla: మా రాష్ట్రానికి రండి... టెస్లాకు ప్రతిపాదనలు పంపిన ఏపీ ప్రభుత్వం

  • భారత్ కు వస్తున్న ఎలాన్ మస్క్
  • ఈ నెల 22న ప్రధాని మోదీతో భేటీ
  • టెస్లాకు రెండు ఈమెయిళ్లు పంపామన్న ఏపీ ప్రభుత్వం

AP Govt invites Tesla

ప్రముఖ విద్యుత్ వాహన తయారీ సంస్థ టెస్లాను ఏపీకి రప్పించేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నాలు షురూ చేసింది. ఏపీలో టెస్లా యూనిట్ నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఇప్పటికే రెండు ఈమెయిళ్లు పంపామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

టెస్లా ప్రతినిధి బృందం ఏపీకి వచ్చి పరిశ్రమకు అవసరమైన భూములను పరిశీలించుకోవచ్చని సూచించామని ఆ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా,  అనంతపురం జిల్లాలో కియా ప్లాంట్ సమీపంలో కావాల్సినంత భూమి అందుబాటులో ఉందని స్పష్టం చేశాయి. అక్కడ్నించి బెంగళూరు, చెన్నై, కృష్ణపట్నం పోర్టు దగ్గరగా ఉంటాయని కూడా ఏపీ ప్రభుత్వ వర్గాలు తెలిపినట్టు జాతీయ మీడియా కథనం వెలువరించింది. 

టెస్లా ఏపీకి రావాలే గానీ, ప్రైవేటు వ్యక్తుల నుంచి భూమి కొనుగోలు చేసైనా సరే అందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఓ అధికారి తెలిపారు. ఈ నెల 22న ఎలాన్ మస్క్ భారత ప్రధాని మోదీని కలవనున్నారు. అయితే, ఎన్నికల కోడ్ కారణంగా ఆ భేటీలో ఏం చర్చించారన్నది బయటికి వచ్చే అవకాశం లేదని సదరు ఏపీ ప్రభుత్వ అధికారి చెబుతున్నారు.

More Telugu News