mynampalli Hanmantha Rao: రాబోవు ఎన్నికల్లో కేసీఆర్‌ను చింతమడకకు, హరీశ్ రావును తోటపల్లికి పంపించడం ఖాయం: మైనంపల్లి హన్మంతరావు

Mynampalli Hanmantha Rao says will send kcr and harish rao to home
  • తన టార్గెట్ గజ్వేల్, సిద్దిపేటలో ఇద్దరినీ ఇంటికి పంపుడే అని వ్యాఖ్య
  • బీఆర్‌ఎస్ నాయకులకు డబ్బులు తప్ప కార్యకర్తల బాధలు తెలియవని విమర్శ
  • నీలం మధును గెలిపించి... మాటల్లో కాకుండా చేతల్లో చూపిద్దామన్న మైనంపల్లి
రాబోవు ఎన్నికల్లో మామ కేసీఆర్‌ను చింతమండకకు, అల్లుడు హరీశ్‌రావును తోటపల్లికి పంపించడం ఖాయమని... తన టార్గెట్ గజ్వేల్, సిద్దిపేట అని కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శుక్రవారం ఆయన గజ్వేల్‌లో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ... తన టార్గెట్ గజ్వేల్, సిద్దిపేటలో ఇద్దరినీ ఇంటికి పంపుడే అన్నారు.

ప్రభుత్వం ఉండి ఇక్కడ ఎమ్మెల్యేలు లేకపోవడం బాధాకరమన్నారు. నాయకులు మాజీలు అవుతారు కానీ కార్యకర్తలు మాజీలు కారని పేర్కొన్నారు. నీలం మధు వార్డు మెంబర్ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చాడని... అందుకే ఆయనకు కార్యకర్తల బాధ తెలుసునన్నారు.

బీఆర్‌ఎస్ నాయకులకు డబ్బులు తప్ప కార్యకర్తల బాధలు తెలియవని విమర్శించారు. నీలం మధుకు తల్లి, తండ్రి లేరు కాబట్టి మనమే తల్లిదండ్రులుగా ఉండాలన్నారు. ఆయనను గెలిపించి... మాటల్లో కాకుండా చేతల్లో చూపిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు.
mynampalli Hanmantha Rao
Congress
BRS
KCR

More Telugu News