Bhanuprakash Reddy: జగన్ కు ఇదే చివరి బస్సు యాత్ర: భానుప్రకాశ్ రెడ్డి

This is Jagans last bus yatra says Bhanuprakash Reddy
  • జగన్ మాటలకు, చేతలకు సంబంధం ఉండదన్న భానుప్రకాశ్ రెడ్డి
  • మద్యం అమ్మకాల్లో కోట్లు దోచుకున్నారని విమర్శ
  • దొంగ ఓట్లు, కరెన్సీ నోట్లతో మళ్లీ గెలవాలనుకుంటున్నారని మండిపాటు

మేమంతా సిద్ధం బస్సు యాత్రే సీఎం జగన్ కు చివరి బస్సు యాత్ర అని భానుప్రకాశ్ రెడ్డి అన్నారు. జగన్ చెప్పే మాటలకు, చేతలకు సంబంధం ఉండదని విమర్శించారు. మద్య నిషేధం చేస్తామని చెప్పిన జగన్... మద్యం అమ్మకాల్లో కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. రాష్ట్రం జే బ్రాండ్ మద్యం తాగి ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని చెప్పారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న వారిని వైసీపీ నేతలు వాటాలు అడుగుతున్నారని మండిపడ్డారు. దొంగ ఓట్లు, కరెన్సీ నోట్లతో మళ్లీ గెలవాలని జగన్ చూస్తున్నారని చెప్పారు. ఏపీలో ఆర్థిక మంత్రి లేరని... అప్పుల మంత్రి ఉన్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

  • Loading...

More Telugu News