Balakrishna: హిందూపురంలో బాలకృష్ణ నామినేషన్ కు ముహూర్తం ఖరారు

Balakrishna set file nomination on April 19
  • ఈ నెల 18న ఏపీలో ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
  • ఏప్రిల్ 18 నుంచి 25 వరకు నామినేషన్లకు అవకాశం 
  • ఈ నెల 19న నామినేషన్ వేయాలని బాలకృష్ణ నిర్ణయం
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్లకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నామినేషన్ వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. 

ఈ నెల 19న ఆయన హిందూపురంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపటి నుంచి బాలకృష్ణ ఎన్నికల ప్రచార బరిలో దిగనున్నారు. స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో బాలకృష్ణ ఎన్నికల ప్రచారం సాగించనున్నారు. బాలయ్య కదిరి నుంచి ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. అనంతరం, ఈ నెల 25 నుంచి ఉత్తరాంధ్రలో కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొంటారు. 

కాగా, ఏపీలో ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మే 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. రాష్ట్రంలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఒకే విడతలో జరగనున్న సంగతి తెలిసిందే.
Balakrishna
Nomination
Hindupur
TDP
Andhra Pradesh

More Telugu News