Rajaiah: వరంగల్ లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య?

BRS Warangal MP candidate Tadikonda Rajaiah
  • అధినేత కేసీఆర్ నుంచి రాజయ్యకు పిలుపు
  • బీఆర్ఎస్ అధినేత ఫామ్ హౌస్‌కు బయలుదేరిన రాజయ్య
  • కాసేపట్లో కేసీఆర్ అధికారికంగా రాజయ్య పేరు ప్రకటించే అవకాశం
వరంగల్ లోక్ సభ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య పేరును పార్టీ అధినేత కేసీఆర్ దాదాపు ఖరారు చేశారు. పార్టీ అధినేత నుంచి పిలుపు రావడంతో రాజయ్య ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్‌కు బయలుదేరారు. ఇరువురు చర్చించుకున్న అనంతరం కేసీఆర్ రాజయ్య పేరును అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్యకు గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ టిక్కెట్ నిరాకరించారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం సాగింది.

అధినేత బుజ్జగింపుల తర్వాత ఆయన కడియం శ్రీహరి గెలుపు కోసం పని చేశారు. ఆ తర్వాత వరంగల్ లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం కావ్య పేరును కేసీఆర్ ప్రకటించారు. కానీ అనూహ్యంగా వీరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థి కోసం పలువురి పేర్లను పరిశీలించింది. చివరకు రాజయ్యను కేసీఆర్ ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది.
Rajaiah
Warangal Urban District
KCR
Lok Sabha Polls

More Telugu News