AP Inter Results: వచ్చేసిన ఏపీ ఇంటర్ ఫలితాలు.. ఈసారి కూడా బాలికలే టాప్

AP Inter results released girl again in top place
  • ఉదయం 11 గంటలకు తాడేపల్లి బోర్డు కార్యాలయంలో విడుదల
  • ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు ఒకేసారి వెల్లడి
  • ఫస్టియర్‌లో 67 శాతం, సెకండియర్‌లో 78 శాతం ఉత్తీర్ణత

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఫలితాలు కాసేపటి క్రితం వెల్లడయ్యాయి. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో బోర్డు కార్యదర్శి సౌరభ్‌గౌర్ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. 

ఫలితాల్లో ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు. ఫస్టియర్‌ పరీక్షలను 4,99,756 మంది విద్యార్థులు రాయగా 67 శాతం, సెకండియర్‌ పరీక్షలకు 5,02,394 మంది హాజరుకాగా 78 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ పరీక్ష రాసిన 38 వేల మందిలో 71 శాతం మంది పాసయ్యారు.

  • Loading...

More Telugu News