IPL 2024: ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే మునుపెన్న‌డూ చూడ‌ని స్ట‌న్నింగ్‌ క్యాచ్‌.. వీడియో వైర‌ల్‌!

Reece Topley takes a blinder to dismiss Rohit Sharma Video goes Viral on Internet
  • అద్భుత‌మైన క్యాచ్‌తో రోహిత్ శ‌ర్మను పెవిలియ‌న్ పంపిన రీస్ టాప్లీ
  • ఎంఐ ఇన్నింగ్స్ 12వ ఓవ‌ర్‌లో విల్ జాక్స్ బౌలింగ్‌లో స్ట‌న్నింగ్ క్యాచ్ ప‌ట్టిన ఆర్‌సీబీ ఆట‌గాడు
  • ఒక్క‌సారిగా సైలెంట్ అయిన వాంఖ‌డే స్టేడియం
ఐపీఎల్‌లో భాగంగా వాంఖడే వేదిక‌గా గురువారం రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో ముంబై ఇండియ‌న్స్ త‌ల‌ప‌డింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఆట‌గాడు రీస్ టాప్లీ స్ట‌న్నింగ్ క్యాచ్‌తో స్టేడియంలోని ప్రేక్ష‌కులంద‌రినీ షాక్ అయ్యేలా చేశాడు. భారీ షాట్ల‌తో విరుచుకుప‌డుతున్న‌ ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మను టాప్లీ అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియ‌న్‌కు పంపాడు. 

ఎంఐ ఇన్నింగ్స్ 12వ ఓవ‌ర్ వేసిన విల్ జాక్స్ బౌలింగ్‌లో రెండో బంతిని హిట్‌మ్యాన్ షార్ట్ ఫైన్ లెగ్ వైపు స్వీప్ షాట్ కొట్టాడు. దాంతో షార్ట్ ఫైన్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న టాప్లీ అమాంతం ఎడ‌మ‌వైపు గాల్లోకి ఎగిరి ఒంటిచేతితో అద్భుత‌మైన క్యాచ్ అందుకున్నాడు. టాప్లీ ప‌ట్టిన ఆ స్ట‌న్నింగ్ క్యాచ్‌తో అప్ప‌టివ‌ర‌కు ముంబై అభిమానుల కేరింత‌ల‌తో ద‌ద్ద‌రిల్లిన వాంఖ‌డే స్టేడియం ఒక్క‌సారిగా సైలెంట్ అయిపోయింది. 

రోహిత్ కూడా టాప్లీ అందుకున్న ఆ అద్భుత‌మైన క్యాచ్‌తో ఒకింత ఆశ్చ‌ర్య‌పోయాడు. ఈ స్ట‌న్నింగ్ క్యాచ్ తాలూకు వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజ‌న్లు ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే మునుపెన్న‌డూ చూడ‌ని అద్భుత‌మైన క్యాచ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
IPL 2024
Reece Topley
Rohit Sharma
MI Vs RCB
Cricket
Sports News

More Telugu News