Call Girl: భర్త చిత్రహింసలు భరించలేక విడాకులకు భార్య దరఖాస్తు.. సరికొత్త కుట్రకు తెరతీసి విదేశాలకు చెక్కేసిన భర్త

Husband Names Wife As Call Girl In Facebook Before Going To Abroad
  • పెళ్లయినప్పటి నుంచి భార్యను చిత్రవధ చేస్తున్న భర్త
  • కాల్‌గాళ్ కావాలా? అంటూ ఫేస్‌బుక్‌లో ప్రకటన
  • రెటు ఎంతంటూ ఒకటే ఫోన్లు
  • పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి

వారిద్దరికీ ఐదేళ్ల క్రితం వివాహమైంది. ఆ తర్వాతి నుంచే ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. అతడు పెట్టే మానసిక, శారీరక చిత్రహింసలు భరించలేక విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం ఆమెను ఊహించని కష్టాల్లోకి నెట్టేసింది. భార్యను కాల్‌గాళ్‌గా పేర్కొంటూ ఆమె నంబర్లను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ తర్వాతి నుంచి ఆమె ఫోన్‌కు కాల్స్ వెల్లువ మొదలైంది. ఫోన్ చేస్తున్న వారు రేటెంత అని అడగడం మొదలుపెట్టారు. వాటిని భరించలేక పోలీసులను ఆశ్రయిస్తే భర్త చేసిన దారుణం బయటపడింది. బెంగళూరులో జరిగిందీ ఘటన.

వారిద్దరికీ 2019లో వివాహమైంది. పెళ్లయిన కొన్నాళ్ల నుంచే ఇద్దరికీ సరిపడకపోవడంతో విడాకుల కోసం ఆమె పిటిషన్ దాఖలు చేసింది. దీనిని తట్టుకోలేకపోయిన భర్త.. ఆమెపై కుట్రకు తెరలేపాడు. ‘కాల్ గాళ్స్ కావాలా? అంటూ ఫేస్‌బుక్‌లో భార్య నంబరుతోపాటు ఆమె కుటుంబ సభ్యుల నంబర్లతో ఓ ప్రకటన ఇచ్చాడు. ఆ తర్వాత విదేశాలకు వెళ్లిపోయాడు. ఫేస్‌బుక్‌లో ప్రకటన చూసినవారు ఆమెకు, కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి ఆరా తీయడం మొదలుపెట్టారు. ఫోన్లు వరదలా వస్తుండడంతో ఇదంతా భర్తపనేనని అనుమానించిన ఆమె పోలీసులకు ఫిర్యాదుచేసింది. దర్యాప్తు జరిపిన పోలీసులు ఈ వేధింపులకు కారణం ఆమె భర్తేనని నిర్ధారించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు.

  • Loading...

More Telugu News