కోయంబత్తూరు చేరుకున్న నారా లోకేశ్
- కోయంబత్తూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్న తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై
- ఎన్డీయే పెద్దల సూచనతో అన్నామలై తరఫున లోకేశ్ ప్రచారం
- కోయంబత్తూరులోని తెలుగువారి మద్దతు కోరనున్న లోకేశ్
ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టీడీపీ కూడా ఎన్డీయేలో భాగమైంది. ఈ నేపథ్యంలో, లోకేశ్ సేవలను తెలుగువారు అధికంగా ఉండే కోయంబత్తూరులో ఉపయోగించుకోవాలని ఎన్డీయే పెద్దలు భావించారు. వారి సూచన మేరకు లోకేశ్ కోయంబత్తూరు వెళ్లారు.
లోకేశ్ ఈ రాత్రికి ఎన్డీయే సభలో పాల్గొని, రేపు ఉదయం తెలుగు పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. కోయంబత్తూరు ఎంపీ స్థానం బీజేపీ అభ్యర్థి అన్నామలైకి మద్దతు ఇవ్వాలని స్థానిక తెలుగు ప్రజలను లోకేశ్ కోరనున్నారు.