Pawan Kalyan: రెండు పార్లమెంటు స్థానాలకు ఎన్నికల సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ కల్యాణ్

Pawan Kalyan appoints coordinators for two parliamentary constituencies
  • అమలాపురం, విజయవాడ పార్లమెంటు స్థానాల పరిధిలో సమన్వయకర్తల నియామకం
  • అమలాపురం ఎంపీ స్థానానికి కొత్తపల్లి సుబ్బారాయుడు
  • విజయవాడ పార్లమెంటు స్థానానికి అమ్మిశెట్టి వాసు నియామకం
జనసేనాని పవన్ కల్యాణ్ ఇవాళ పార్టీ పరమైన నిర్ణయం తీసుకున్నారు. అమలాపురం, విజయవాడ పార్లమెంటు స్థానాల పరిధిలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల సమన్వయకర్తలను నియమించారు. అమలాపురం పార్లమెంటు స్థానానికి మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, విజయవాడ పార్లమెంటు స్థానానికి అమ్మిశెట్టి వాసులను సమన్వయకర్తలుగా నియమించారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో వీరు మూడు పార్టీల మధ్య సమన్వయం కోసం కృషి చేస్తారని, మిత్ర పక్షాల అభ్యర్థుల విజయం కోసం పాటుపడతారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో  తెలిపింది.
Pawan Kalyan
Amalapuram
Vijayawada
Coordinators
Lok Sabha Polls

More Telugu News