కాంగ్రెస్ గెలిస్తే పరిశ్రమలు, మీడియా, బ్యూరోక్రసీ వంటి వివిధ రంగాల్లో జనగణన చేపడతాం: రాహుల్ గాంధీ
- దళితులు, గిరిజనులు, బీసీలు, పేద సాధారణ తరగతి వారు ఎంత శాతం ఉన్నారో లెక్కిస్తామని వెల్లడి
- రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ
- కుల ఆధారిత జనాభా లెక్కల ద్వారా పాలు ఏవో... నీరు ఏవో తెలిసిపోతుందని వ్యాఖ్య
మొదట, ఎవరికి ఎక్కువ సహాయం అవసరమో తెలుసుకోవడానికి... వివిధ కులాలకు చెందినవారు ఎంతమంది ఉన్నారో లెక్కిస్తామన్నారు. ఆ తర్వాత, దేశం ఆర్థికంగా ఎలా పని చేస్తుందో పరిశీలించి, డబ్బు, ఉద్యోగాలు, ఇతర ప్రయోజనాలను జనాభా ఆధారంగా పంచడానికి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.