Lok Sabha Polls: ఫరీద్‌కోట్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఇందిరాగాంధీ హంతకుడి కొడుకు

  • ఇందిరాగాంధీ ఇద్దరు హంతకుల్లో ఒకరు బియాంత్ సింగ్
  • ఫరీద్‌కోట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బియాంత్ సింగ్ కొడుకు సరబ్‌జిత్ సింగ్
  • గతంలోనూ పోటీ చేసిన సరబ్‌జిత్ సింగ్
దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హంతకుల్లో ఒకరి బంధువు పంజాబ్‌లోని పార్లమెంటరీ ఎన్నికల్లో ఫరీద్‌కోట్ (రిజర్వ్డ్) నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పన్నెండో తరగతి డ్రాపౌట్ అయిన 45 ఏళ్ల సరబ్‌జిత్ సింగ్ ఖల్సా లోక్ సభ బరిలో నిలుచున్నారు. ఇందిరాగాంధీని హత్యచేసిన ఇద్దరు హంతకుల్లో బియాంత్ సింగ్ ఒకరు. ఇతని కుమారుడే సరబ్‌జిత్ సింగ్.

సరబ్‌జిత్ సింగ్ ఖల్సా వరుసగా 2009, 2014 లోక్ సభ ఎన్నికల్లో భటిండా, ఫతేఘర్ సాహిబ్ (రిజర్వ్డ్) స్థానాల నుంచి పోటీ చేశారు. కానీ విజయం సాధించలేదు. 2019లో ఆయన బహుజన సమాజ్ పార్టీ నుంచి పోటీ చేశారు. 2014లో సరబ్‌జిత్ సింగ్ ఖల్సా తన ఆస్తులను రూ.3.5 కోట్లుగా ప్రకటించారు. సరబ్‌జిత్ సింగ్ తల్లి బిమల్ కౌర్, అతని తాత సుచా సింగ్‌లు గతంలో ఎంపీలుగా పని చేశారు.
Lok Sabha Polls
Punjab

More Telugu News