Manda Krishna Madiga: కాంగ్రెస్ పాలనలో మాలలకే అధిక ప్రాధాన్యత: మంద కృష్ణ మాదిగ

Manda Krishna Madiga blames congress
  • కాంగ్రెస్ నాయకులు మాదిగ పల్లెలకు వస్తే తరిమికొడతామని హెచ్చరిక
  • కాంగ్రెస్‌‌పై మాదిగలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వ్యాఖ్య
  • మాదిగలకు ప్రాధాన్యత ఇచ్చామని చెప్పుకోవడానికే రాజనర్సింహకు పదవి ఇచ్చారని విమర్శ

కాంగ్రెస్ పాలనలో మాలలకు అధిక ప్రాధాన్యతనిస్తూ, మాదిగలకు అన్యాయం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు మాదిగ పల్లెలకు వస్తే తరిమికొడతామని హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్‌‌పై మాదిగలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వ్యాఖ్యానించారు. మాదిగపల్లెలకు ప్రచారానికి రాకపోవడం కాంగ్రెస్‌కు మంచి చేయదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాలలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారనేది అక్షర సత్యమన్నారు.

వచ్చే ఎన్నికల్లో మాదిగలకు మూడు పార్లమెంట్ టికెట్లు ఇవ్వకుంటే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. మాదిగలకు ప్రాధాన్యత ఇచ్చామని చెప్పుకోవడానికి మాత్రమే దామోద రాజనర్సింహకు పదవి ఇచ్చారని విమర్శించారు. బాబు జగ్జీవన్‌రామ్‌ భవన్ ఆవిష్కరణ ఆహ్వాన పత్రికలో దామోదర రాజనర్సింహ పేరు లేకపోవడం బాధాకరమన్నారు. ఈ అంశంలో కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుందని హెచ్చరించారు. ఆ పార్టీ నేతలు మాదిగ పల్లెలకు వచ్చి ఓట్లు ఎలా అడుగుతారో చూస్తామన్నారు.

  • Loading...

More Telugu News