Vishnu Vishal: నాలుగేళ్ల వివాదానికి తెర‌.. కలిసిపోయిన కోలీవుడ్ హీరో, క‌మేడియ‌న్‌!

Kollywood Hero Vishnu Vishal and Comedian Suri Photo on Twitter
  • ఓ స్థ‌లం విష‌యంలో హీరో విష్ణు విశాల్‌, క‌మేడియ‌న్‌ సూరి మ‌ధ్య వివాదం
  • 2020లో విష్ణు, అత‌ని తండ్రి ర‌మేశ్‌పై స్థ‌లం విష‌యంలో త‌న‌ను మోసం చేశారంటూ కేసు పెట్టిన సూరి
  • ఇటీవ‌ల లాల్ స‌లామ్ చిత్ర ప్ర‌చార వేదిక‌పై కూడా త‌మ మ‌ధ్య నెల‌కొన్న స‌మ‌స్యపై మాట్లాడిన విష్ణు విశాల్‌
  • ఇంత‌లోనే సూరితో క‌లిసి ఉన్న ఫొటోను 'ఎక్స్' వేదిక‌గా పంచుకున్న హీరో

కోలీవుడ్‌ హీరో విష్ణు విశాల్‌, క‌మేడియ‌న్‌ సూరి క‌లిసిపోయారు. వీరిద్ద‌రి మ‌ధ్య ఓ స్థ‌లం విష‌యంలో చోటుచేసుకున్న‌ వివాదం తాజాగా స‌మ‌సిపోయిన‌ట్లు తెలుస్తోంది. 2020లో విష్ణు, అత‌ని తండ్రి ర‌మేశ్‌పై స్థ‌లం విష‌యంలో త‌న‌ను మోసం చేశారంటూ న‌టుడు సూరి పోలీష్‌స్టేష‌న్‌లో కేసు పెట్టాడు. ఈ వివాదం చాలా కాలం కొనసాగింది. 

అయితే, ఇటీవ‌ల లాల్ స‌లామ్ చిత్రం ప్ర‌చార వేదిక‌పై కూడా త‌మ మ‌ధ్య నెల‌కొన్న స‌మ‌స్య విష‌య‌మై తానూ, సూరి చ‌ర్చించుకుంటున్నామ‌ని విష్ణు విశాల్ చెప్పాడు. అలాంటిది ఇప్పుడు స‌డ‌న్‌గా న‌టుడు విష్ణు విశాల్, ఆయ‌న తండ్రి ర‌మేశ్‌, సూరితో క‌లిసి ఉన్న ఫొటోను త‌న 'ఎక్స్' (ట్విట‌ర్) ఖాతా ద్వారా షేర్ చేశారు. 

'స‌మ‌యం అన్నింటికీ, అంద‌రికీ బ‌దులిస్తుంది. ల‌వ్ యూ నాన్న' అని విష్ణు విశాల్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో ఈ ఇద్ద‌రి మ‌ధ్య నెల‌కొన్న వివాదం స‌ద్దుమ‌ణిగింద‌ని అంద‌రూ అనుకుంటున్నారు. ఇక న‌టుడు సూరి, విష్ణువిశాల్ క‌లిసి ఏడు చిత్రాల్లో న‌టించారు. ఇద్ద‌రికీ త‌మిళ ఇండ‌స్ట్రీలో మంచి పేరు కూడా ఉంది.

  • Loading...

More Telugu News