Revanth Reddy: జనగామ జిల్లా అదనపు కలెక్టర్‌ను అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Revanth Reddy Congratulates Jangaon district collector
  • రైతులను మోసం చేయడానికి ప్రయత్నించిన ట్రేడర్లపై క్రిమినల్ కేసులు పెట్టించిన అదనపు కలెక్టర్
  • నిర్లక్ష్యంగా వ్యవహరించిన మార్కెట్ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని ఆదేశాలు
  • అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్‌కు అభినందనలు అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్

రైతులను మోసం చేసిన వారిపై జనగామ జిల్లా అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ కేసులు పెట్టించారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనను అభినందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై సీఎం ట్వీట్ చేశారు. ధాన్యం కొనుగోళ్ల అంశంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు... వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులందరూ ధాన్యం కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

'జనగామ వ్యవసాయ మార్కెట్‌లో జరిగిన ఘటనపై సకాలంలో స్పందించి... రైతులను మోసం చేయడానికి ప్రయత్నించిన నలుగురు ట్రేడర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించిన... నిర్లక్ష్యంగా వ్యవహరించిన మార్కెట్ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని ఆదేశించిన అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ గారికి నా అభినందనలు' అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్‌లో ప్రశంసించారు.

  • Loading...

More Telugu News