Akhilesh Yadav dauthter: యూపీ ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా అఖిలేశ్ యాదవ్ కూతురు

Akhilesh Yadav daughter Aditi Yadav is center of attraction in election campaign
  • మైన్ పురీ నుంచి పోటీ చేస్తున్న అఖిలేశ్ భార్య డింపుల్ యాదవ్
  • తల్లికి మద్దతుగా ప్రచారం చేస్తున్న కూతురు అదితీ యాదవ్
  • అదితిని చూసేందుకు ఉత్సాహం చూపుతున్న ప్రజలు
దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల హడావుడి నెలకొంది. యావత్ దేశం ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయింది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయాయి. మరోవైపు యూపీ రాజకీయ యోధుడు, దివంగత ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలోని మూడో తరం ఎన్నికల ప్రచారంలోకి దిగింది. మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ మైన్ పురీ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆమెకు మద్దతుగా వారి కూతురు అదితీ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. 

పదునైన ప్రసంగాలు చేస్తూ అదితి ఓటర్లను ఆకట్టుకుంటోంది. ఆమెను చూసేందుకు ప్రజలు ఉత్సాహం చూపుతున్నారు. అదితి లండన్ లో చదువుకుంటున్నారు. సెలవుల కోసం ఇంటికి వచ్చిన ఆమె... తల్లి కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. ములాయం సింగ్ మరణానంతరం మైన్ పురీ స్థానం నుంచి పోటీ చేసి డింపుల్ విజయం సాధించారు. ప్రస్తుతం మైన్ పురీ ఎంపీగా ఆమె ఉన్నారు. ఈసారి ఎన్నికలు ఆమెకు అంత సులభం కాదని విశ్లేషణలు వస్తున్నాయి. దీంతో, ఆమె బీజేపీని, ప్రధాని మోదీని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. 
Akhilesh Yadav dauthter
Aditi Yadav
Uttar Pradesh

More Telugu News