హర్యానాలో స్కూలు బస్సు బోల్తాపడి ఆరుగురు చిన్నారుల మృతి
- మహేంద్రగఢ్ జిల్లాలో ఘటన
- ప్రమాద సమయంలో బస్సులో 40 మంది చిన్నారులు
- మద్యం మత్తులో బస్సు డ్రైవర్
ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా, 15 మంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గాయపడిన చిన్నారులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.