Pothina Mahesh: చీటర్ సుజనా చౌదరిని ఓడించడమే నా లక్ష్యం: పోతిన మహేశ్

My target is to defeat Sujana Chowdary says Pothina Mahesh
  • జనసేన పార్టీ ఒక నటుల సంఘమన్న పోతిన మహేశ్
  • వైసీపీలో రాజకీయ పునర్జన్మను పొందుతామని వ్యాఖ్య
  • తన రాజకీయ భవిష్యత్తును జగన్ చూసుకుంటారనే నమ్మకం ఉందన్న పోతిన
వైసీపీలో చేరిన పోతిన మహేశ్ జనసేన, పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పించారు. జనసేన రాజకీయ పార్టీ కాదని, అదొక నటుల సంఘమని విమర్శించారు. పెత్తందారుల కూటమిలో పవన్ చేరారని అన్నారు. కార్యకర్తల భవిష్యత్తుకు ఉరితాడు వేసిన జనసేనలో ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు. తమ వ్యక్తిత్వాన్ని జనసేనలో చంపేశారని అన్నారు. 

వైసీపీలో తాను రాజకీయ పునర్జన్మను పొందుతామని అన్నారు. జనసేనలో ఉన్నప్పుడు రాజకీయ కారణాలతోనే వైసీపీ నేతలను విమర్శించాల్సి వచ్చిందని చెప్పారు. విజయవాడ వెస్ట్ లో బీజేపీ అభ్యర్థి, చీటర్ సుజనా చౌదరిని ఓడించడమే తన లక్ష్యమని అన్నారు. వైసీపీ అభ్యర్థిని కచ్చితంగా గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తన రాజకీయ భవిష్యత్తును జగన్ చూసుకుంటారనే నమ్మకం తనకు ఉందని చెప్పారు.
Pothina Mahesh
YSRCP
Sujana Chowdary
BJP
Pawan Kalyan
Janasena

More Telugu News