KTR: హైదరాబాద్ అంటే ఇదీ... కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

BRS leader KTR tweet on Hyderabad
  • హైదరాబాద్ వరల్డ్ క్లాస్ సిటీ అని ఎవ‌రైనా స‌రే ఒప్పుకోక త‌ప్ప‌ని నిజమని వ్యాఖ్య
  • దేశంలోనే అత్యంత వేగంగా హైద‌రాబాద్ న‌గ‌రం అభివృద్ధి చెందిందన్న కేటీఆర్
  • బెంగ‌ళూరు, హైద‌రాబాద్ సిటీల‌ను పోల్చుతూ రెఫ‌రెన్స్‌గా హైద‌రాబాద్ ఫొటో వాడ‌కంపై హ‌ర్షం
హైదరాబాద్ అంటే వరల్డ్ క్లాస్ సిటీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. భారతదేశంలో గ్లోబల్ సామర్థ్యం కలిగిన 95 సెమీకండక్టర్స్ యూనిట్లు ఉన్నాయని ఇండియన్ టెక్ అండ్ ఇన్ఫ్రా ట్వీట్ చేసింది. దీనిపై కేటీఆర్ స్పందించారు.

హైదరాబాద్ వరల్డ్ క్లాస్ సిటీ అని ఎవ‌రైనా స‌రే ఒప్పుకోక త‌ప్ప‌ని నిజమని, దేశంలోనే అత్యంత వేగంగా హైద‌రాబాద్ న‌గ‌రం అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. హైద‌రాబాద్ విశ్వ‌న‌గ‌రంగా రూపాంత‌రం చెందిందని, బెంగ‌ళూరు, హైద‌రాబాద్ సిటీల‌ను పోల్చుతూ రెఫ‌రెన్స్‌గా హైద‌రాబాద్ ఫొటో వాడ‌కంపై మాజీ మంత్రి హ‌ర్షం వ్య‌క్తం చేశారు. హైద‌రాబాద్ అంటే ఇదీ అంటూ పేర్కొన్నారు.
KTR
Hyderabad
Bengaluru
BRS

More Telugu News