Revanth Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో భువనగిరి ముఖ్యనేతలతో రేవంత్ రెడ్డి సమావేశం

Revanth Reddy meeting with Bhuvanagiri Parliamentary Constituency leaders
  • భేటీకి రాజగోపాల్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు హాజరు
  • ముఖ్య నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
  • ఈ నెల 21న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గస్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఈ భేటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరయ్యారు.

ముఖ్య నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ నెల 21న నామినేషన్ దాఖలు చేయనున్నారు. అదే రోజున సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఉండనుంది. ఆ తర్వాత మే మొదటి వారంలో మరో బహిరంగ సభను నిర్వహిస్తారు. ఈ సభకు ప్రియాంకగాంధీ హాజరు కానున్నారు.

  • Loading...

More Telugu News