Taapsee: నా పెళ్లి గురించి బయటకు చెప్పకపోవడానికి కారణం ఇదే..: తాప్సీ

My marriage is purely personal says Taapsee
  • ప్రియుడు మథియాస్ ను పెళ్లాడిన తాప్సీ
  • పెళ్లి తమ వ్యక్తిగత విషయమన్న తాప్సీ
  • ఫొటోలు, వీడియోలను షేర్ చేయడానికి సిద్ధంగా లేనని స్పష్టీకరణ
సినీ నటి తాప్సీ ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. తన ప్రియుడు, డెన్మార్క్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియాస్ బోను ఆమె పెళ్లాడారు. మార్చి 23న ఉదయ్ పూర్ లో వీరి వివాహం జరిగింది. అయితే, పెళ్లి విషయాన్ని తాప్సీ సీక్రెట్ గా ఉంచింది. తాజాగా దీనిపై ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... పెళ్లి తమ వ్యక్తిగత వ్యవహారమని చెప్పారు. పెళ్లికి సంబంధించిన విషయాలను వెల్లడిస్తూ అందరిలో ఆసక్తిని పెంచాలని తాము భావించలేదని అన్నారు. తన పెళ్లి గురించి అందరూ చర్చించుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పారు. అందుకే సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించలేదని అన్నారు. 

పెళ్లి చేసుకున్న విషయాన్ని ఎప్పటికీ రహస్యంగా ఉంచాలనే ఉద్దేశం కూడా తమకు లేదని తాప్సీ చెప్పారు. తమ తల్లిదండ్రులకు అన్నీ తెలుసని... వాళ్ల అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నామని తెలిపారు. జీవింతంలో ఒక్కసారే చేసుకునే పెళ్లిని ఆనందంగా చేసుకోవాలని అనుకున్నానని.... అందుకే ఆర్భాటాలకు తావు లేకుండా, కొందరి సమక్షంలోనే ఒక్కటయ్యామని చెప్పారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను అందరితో పంచుకోవడానికి తాను సిద్ధంగా లేనని తెలిపారు. భవిష్యత్తులో షేర్ చేయాలనుకుంటే చేస్తానని చెప్పారు.
Taapsee
Marriage
Tollywood
Bollywood

More Telugu News