Muralidhar Goud: సూటిగా మాట్లాడితే ఎవరికీ నచ్చం: నటుడు మురళీధర్ గౌడ్

Muralidhar Goud Interview
  • 'బలగం'తో బిజీ అయిన మురళీధర్ గౌడ్
  • తనకి ఫ్రెండ్స్ లేరని వెల్లడి 
  • యూత్ ఆసక్తిని చూపడం లేదని వ్యాఖ్య 
  • ట్రెండ్ ధోరణి తనకి బాధ కలిగిస్తుందని వివరణ  

'డీజే టిల్లు' .. 'బలగం' సినిమాలతో నటుడిగా తానేమిటనేది మురళీధర్ గౌడ్ నిరూపించుకున్నారు. సహజమైన ఆయన నటన .. డైలాగ్ డెలివరీని ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. అందువలన వరుస సినిమాలతో ఆయన బిజీగా ఉన్నారు. తాజాగా ఐ డ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన స్వభావం గురించి ప్రస్తావించారు.

"నేను మృదు స్వభావిని .. చాలా తక్కువగా మాట్లాడతాను .. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను .. నిర్మొహమాటంగా మాట్లాడతాను. 'యథార్థవాది లోక విరోధి' అని ఒక నానుడి ఉంది. అలా నిజం మాట్లాడేవారు ఎవరికి నచ్చరు .. నా పరిస్థితి కూడా అంతే.  సూటిగా మాట్లాడే నా స్వభావం కారణంగానే నాకు ఫ్రెండ్స్ ఎవరూ లేరు. నేను ఎక్కడికీ వెళ్లి ఎవరితోనూ కబుర్లు చెప్పను" అని అన్నారు. 

" మనం చేసేది ఎదుటివారికి నచ్చనప్పుడు .. ఎదుటివారు చేసేది మనకి నచ్చనప్పుడు ఎవరి పనులు వారు చేసుకోవడమే బెటర్ అనేది నా ఉద్దేశం. కష్టపడితేనే .. కష్టం విలువ తెలిస్తేనే ఎవరైనా పైకి వస్తారు. ఈ రోజున మామిడి విత్తనం నాటి మరుసటి రోజు ఉదయాన్నే పండ్ల కోసం పైకి చూస్తున్న ట్రెండ్ ఇది. యూత్ లో వందకి తొంభై మందికి తెలుకోవాలనే ఆసక్తి లేకపోవడం నాకు బాధ కలిగిస్తూ ఉంటుంది" అని చెప్పారు. 

  • Loading...

More Telugu News