Pat Cummins: కెప్టెన్‌కు హార‌తి.. ప్యాట్ కమిన్స్ స్పంద‌న ఇదీ!

Fan Harathi to SRH Captain Pat Cummins Video goes Viral on Social Media
  • మొహాలిలో పీబీకేఎస్ వ‌ర్సెస్ ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌
  • టాస్ స‌మ‌యంలో సార‌ధి క‌మిన్స్‌కు ఓ అభిమాని హార‌తి
  • ఈ వీడియోకు 'దండాల‌య్యా' బీజీఎంను జోడించి నెట్టింట పెట్ట‌డంతో వైర‌ల్‌గా మారిన వైనం
  • త‌న‌పై చూపించిన అభిమానానికి 'థ్యాంక్యూ' అంటూ రిప్లై ఇచ్చిన ప్యాట్ కమిన్స్
ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ త‌న‌దైన ఆట‌తో అద‌ర‌గొడుతున్న విష‌యం తెలిసిందే. మంగ‌ళ‌వారం పంజాబ్‌ను మ‌ట్టిక‌రిపించి ఎస్ఆర్‌హెచ్‌ ముచ్చ‌ట‌గా మూడో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. ఈ నేప‌థ్యంలో కెప్టెన్ ప్యాట్ క‌మిన్స్‌పై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. త‌న కెప్టెన్సీలో జ‌ట్టును అద్భుతంగా న‌డిసిస్తున్నాడంటూ ఆరెంజ్ ఆర్మీ అభిమానులు మురిసిపోతున్నారు. కెప్టెన్సీ మార్పు త‌ర్వాత స‌న్‌రైజ‌ర్స్ ఆట‌లోనూ మార్పు వ‌చ్చింద‌ని ఫ్యాన్స్ అంటున్నారు.    

ఇక నిన్న‌టి మ్యాచ్‌లో టాస్ స‌మ‌యంలో సార‌ధి క‌మిన్స్ మాట్లాడుతుండ‌గా ఓ అభిమాని అత‌డికి హార‌తి ఇచ్చాడు. ఈ వీడియోకు బాహుబ‌లిలోని 'దండాల‌య్యా' బీజీఎంను జోడించి 'ఎక్స్' (ట్విట‌ర్‌) లో షేర్ చేయ‌డంతో అది కాస్తా వైర‌ల్‌గా మారింది. దీనిపై స్పందించిన క‌మిన్స్ 'థ్యాంక్యూ' అంటూ రిప్లై ఇచ్చాడు. కాగా, మొహాలి వేదిక‌గా జ‌రిగిన నిన్న‌టి మ్యాచ్‌ ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన విష‌యం తెలిసిందే. చివ‌రికి స‌న్‌రైజ‌ర్స్ రెండు పరుగుల తేడాతో గ‌ట్టెక్కింది. 183 పరుగుల లక్ష్యఛేదనతో బ‌రిలోకి దిగిన‌ పంజాబ్ కింగ్స్ 180 పరుగుల‌కే ప‌రిమిత‌మైంది.
Pat Cummins
SRH
IPL 2024
Cricket
Sports News

More Telugu News