Ranjith Reddy: కుటుంబ సభ్యులు చేసిన ఉగాది పచ్చడిని వర్కింగ్ వుమెన్‌కు పంచిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి

Ranjith Reddy distributed Ugadhi Pachadi to working women
  • చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపిన రంజిత్ రెడ్డి
  • ఉగాది పచ్చడి అందుబాటులో ఉండని వర్కింగ్ వుమెన్‌కు, మరికొంతమందికి పంపిణీ
  • కుటుంబ సభ్యులు కలిసి పలు ప్రాంతాల్లో ఉగాది పచ్చడిని పంపిణీ చేసినట్లు వెల్లడి

చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్కింగ్ వుమెన్‌కు ఉగాది పచ్చడిని పంచారు. కుటుంబ సభ్యులు తయారు చేసిన పచ్చడిని ఆయన వర్కింగ్ వుమెన్‌కు స్వయంగా అందించారు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని ప్రజలందరికీ తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

ఉగాది అనగానే షడ్రుచులతో కూడిన పచ్చడి అని... ఇందులో తీపి, చేదు, వగరు... ఇలా జీవితంలో అన్ని రుచులు ఉంటాయని చెప్పేది ఉగాది పచ్చడని పేర్కొన్నారు. వర్కింగ్ వుమెన్‌కు, మరికొంతమందికి ఇలాంటి ఉగాది పచ్చడి అందుబాటులో ఉండకపోవచ్చునని... అందుకే తాను, తన కుటుంబ సభ్యులు కలిసి పలు ప్రాంతాల్లో ఉగాది పచ్చడిని పంపిణీ చేశామని తెలిపారు. అందరితో కలిసిమెలిసి పండుగ జరుపుకున్నట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News