KTR: బీఆర్ఎస్‌‍ను వీడుతున్న వారిపై జాతీయ ఛానల్‌తో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

This is common in politics ktr on who leaving party
  • రాజకీయాల్లో ఇవి సహజమేనన్న కేటీఆర్
  • బీఆర్ఎస్ 24 ఏళ్ల పార్టీ... ఎన్నో ఎత్తుపల్లాలు చూశామని వ్యాఖ్య
  • బీఆర్ఎస్ ప్రథమ లక్ష్యం తెలంగాణ... అది నెరవేరిందన్న కేటీఆర్
  • పార్టీని ఎవరు వీడుతున్నారనే అంశంతో సంబంధం లేకుండా ప్రజల కోసం పోరాడుతామని వెల్లడి
తమ పార్టీని వీడి కొంతమంది నాయకులు ఇతర పార్టీల్లోకి వెళుతున్నారని... కానీ రాజకీయాల్లో ఇవి సహజమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం ఆయన పీటీఐతో మాట్లాడుతూ... తమది 24 ఏళ్ల పార్టీ అని... ఎన్నో ఎత్తుపల్లాలు చూశామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తమ పార్టీ ప్రథమ లక్ష్యమని, ఆ కల నెరవేరిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రానికి సేవ చేసే సువర్ణావకాశం కూడా తమకు లభించిందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు కృషి చేశామన్నారు.

కొంతమంది పార్టీని వీడుతున్న మాట వాస్తవమేనని... కానీ రాజకీయాల్లో ఇది సర్వసాధారణమన్నారు. ప్రతి రాజకీయ పార్టీకి అప్ అండ్ డౌన్స్ ఉంటాయన్నారు. ఈరోజుకూ తెలంగాణ కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమే అన్నారు. రైతులు, యువత, మహిళల కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ తమదే అన్నారు. పార్టీని ఎవరు వీడుతున్నారనే అంశంతో సంబంధం లేకుండా తాము ప్రజల కోసం పోరాడుతామన్నారు.
KTR
Telangana
BRS
BJP
Congress

More Telugu News