Kalki 2898 AD: ప్రభాస్ 'కల్కి' చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హాలీవుడ్ సెలెబ్రిటీ

Jonathan Nolan comments on Prabhas starring Kalki 2898 AD
  • ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి
  • భారత ఫిలింమేకర్స్ హాలీవుడ్ వాళ్లను మించిపోతున్నారన్న జోనాథన్ నోలన్
  • కల్కి మూవీ టీమ్ అద్భుతంగా ముందుకు వెళుతోందని కితాబు 

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ కల్కి 2898 ఏడీ. ఈ చిత్రంపై హాలీవుడ్ స్క్రీన్ రైటర్, నిర్మాత జోనాథన్ నోలన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ఇప్పటి ట్రెండ్ లో భారత ఫిలిం మేకర్స్ హాలీవుడ్ వాళ్ల కంటే బాగా పనిచేస్తున్నారని కితాబునిచ్చారు. సినిమాలో ప్రతీ సీన్ ను అర్థవంతంగా చూపిస్తున్నారని కొనియాడారు. కల్కి మూవీ టీమ్ కు ఎవరూ, ఎలాంటి సలహాలు ఇవ్వాల్సిన పనిలేదని, వారు అద్భుతంగా ముందుకెళుతున్నారని జోనాథన్ నోలన్ అభినందించారు. ప్రతీ అంశంలోనూ వారు ప్రాక్టికల్ గా వ్యవహరిస్తున్నారని వివరించారు. 

భారతీయ చిత్రాల్లో లొకేషన్ల నుంచి స్టంట్స్ వరకు పలు అంశాలు ఆకట్టుకుంటాయని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా తనకు సైన్స్ ఫిక్షన్ జానర్లో సినిమాలు రూపొందించడం చాలా ఇష్టం అని జోనాథన్ నోలన్ వెల్లడించారు. 

కల్కి 2898 ఏడీ చిత్రంలో ప్రభాస్ సరసన దీపిక పదుకొణే హీరోయిన్ గా నటిస్తోంది. నట దిగ్గజాలు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తుండగా, దిశా పటానీ కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది.

  • Loading...

More Telugu News