Chandrababu: వైసీపీ గ్యాంబ్లర్ల నుంచి కూడా విరాళాలు సేకరించింది: చంద్రబాబు

Chandrababu alleges YCP has taken donations from gamblers
  • టీడీపీ విరాళాల వెబ్ సైట్ ను ప్రారంభించిన చంద్రబాబు
  • విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి
  • ఎన్ఆర్ఐల నుంచి నిబంధనల మేరకే విరాళాలు స్వీకరిస్తామని వెల్లడి
  • ఏపీలో జగన్ తప్ప ఎవరూ బాగుపడలేదని విమర్శలు
టీడీపీ విరాళాల వెబ్ సైట్ అందుబాటులోకి తీసుకువచ్చిన సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ, పార్టీకి విరాళాలు ఇవ్వాలని శ్రేణులను, సానుభూతిపరులను కోరారు. 

రూ.10 నుంచి ఎంత మొత్తంలోనైనా విరాళాలు ఇవ్వొచ్చని తెలిపారు. వైసీపీ గ్యాంబ్లర్ల నుంచి కూడా విరాళాలు సేకరించిందని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. ఆ విధంగా విరాళాలు సేకరించి ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ కు అనుమతించాలని చూశారని ఆరోపించారు. 

ఎన్ఆర్ఐల నుంచి నిబంధనల మేరకే విరాళాలు సేకరిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్ఆర్ఐలు రాష్ట్రానికి వచ్చి పార్టీ కోసం, రాష్ట్రం కోసం పని చేయాలని సూచించారు. ఏపీలో జగన్ తప్ప ఎవరూ బాగుపడలేదని, రాష్ట్రంలో ప్రతి వర్గం నష్టపోయిందని అన్నారు. దేశం సరైన దిశలో వెళుతుంటే, ఏపీ రివర్స్ లో వెళుతోందని చంద్రబాబు విమర్శించారు. 

జనంలో ఇప్పటివరకు చూడని అసహనం కనిపిస్తోందని, జనంలో ఎవరికీ అర్థం కాని భయం, ఆందోళన కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. సోలార్ ఎనర్జీ వ్యవస్థలు అందుబాటులోకి వచ్చినా రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉన్నాయని అన్నారు. 

రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసిన వైసీపీకి ఈ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకూడదని చంద్రబాబు పిలుపునిచ్చారు. కూటమి జెండాలు ప్రతి ఇంటిపై ఎగురవేయాలని, కూటమిని ముందుండి నడిపించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
Chandrababu
Donations
Website
TDP
TDP-JanaSena-BJP Alliance
Jagan
YSRCP

More Telugu News