Chandrababu: ఈ ఏడాది చంద్ర‌బాబుకు అన్నీ మంచి శకునములే.. టీడీపీ కార్యాల‌యంలో పంచాంగ కర్త!

Chandrababu participate in Ugadi Festival Celebrations in Mangalagiri TDP office
  • మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో ఘ‌నంగా ఉగాది వేడుక‌లు  
  • ఈ ఏడాది చంద్ర‌బాబుకు బాగా క‌లిసి వ‌స్తుందన్న‌ పంచాంగ‌క‌ర్త మాచిరాజు వేణుగోపాల్
  • బాబుకు అధికార యోగం ఉంద‌న్న పంచాంగ‌క‌ర్త‌
  • ఈసారి ఎన్నిక‌ల్లో కూట‌మికి 128 అసెంబ్లీ స్థానాలు, 24 పార్ల‌మెంట్ సీట్లు వ‌స్తాయ‌ని జోస్యం 
  • ఈ ఏడాది చంద్ర‌బాబు అమ‌రావ‌తి నిర్మాణం చేప‌డ‌తార‌ని వెల్లడి  
  • త్రిమూర్తుల క‌ల‌యిక‌తో ఏపీకి మేలు జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టీక‌ర‌ణ‌
టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఉగాది వేడుక‌ల‌ను ఘ‌నంగా జ‌రుపుకున్నారు. మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో జ‌రిగిన ఈ వేడుక‌ల్లో ప్ర‌ముఖ పంచాంగ‌క‌ర్త మాచిరాజు వేణుగోపాల్ పంచాంగ శ్ర‌వ‌ణం చేశారు. ఈ సంద‌ర్భంగా శ్రీ క్రోధి నామ సంవత్సరం చంద్ర‌బాబుకు బాగా క‌లిసి వ‌స్తుంద‌న్నారు. 

ఈ ఏడాది చంద్ర‌బాబుకు అధికార యోగం ఉంద‌ని పంచాంగ‌క‌ర్త తెలిపారు. ఈసారి ఎన్నిక‌ల్లో కూట‌మి 128 అసెంబ్లీ స్థానాలు, 24 పార్ల‌మెంట్ స్థానాల్లో జ‌య‌కేత‌నం ఎగ‌ర‌వేస్తుంద‌న్నారు. చంద్ర‌బాబు అమ‌రావ‌తి నిర్మాణం చేప‌డ‌తార‌ని తెలిపారు. అలాగే త్రిమూర్తుల క‌ల‌యిక‌తో ఏపీకి మేలు జ‌రుగుతుంద‌ని చెప్పారు. మోదీని బ్ర‌హ్మగా, ప‌వ‌న్‌ను విష్ణువుగా, చంద్ర‌బాబును ఈశ్వ‌రుడిగా ఆయ‌న‌ పేర్కొన్నారు.
Chandrababu
Ugadi Festival
Mangalagiri
TDP
Andhra Pradesh

More Telugu News