Rohit Sharma: సచిన్, భ‌జ్జీ, యువ‌రాజ్‌ల‌ను దింపేసిన రోహిత్.. నవ్వు తెప్పిస్తున్న హిట్‌మ్యాన్ వీడియో!

Rohit Sharma Imitate Sachin Tendulkar and other Indian Cricketers Video goes Viral on Social Media
  • భార‌త మాజీ క్రికెటర్లను ఇమిటేట్ చేసిన రోహిత్ శర్మ 
  • ద్రవిడ్ సిగ్నేచర్ బ్యాటింగ్ స్టాండ్, సచిన్ స్ట్రెయిట్ డ్రైవ్, భజ్జీ బౌలింగ్ యాక్షన్‌ను అనుక‌రించిన రోహిత్   
  • నెట్టింట హిట్‌మ్యాన్‌ ఫన్నీ వీడియో వైరల్‌
భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్‌ రోహిత్ శర్మకు సంబంధించిన ఓ ఫ‌న్నీ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్య‌మాల్లో తెగ‌ వైరల్ అవుతోంది. అందులో హిట్‌మ్యాన్ భార‌త మాజీ క్రికెటర్లను ఇమిటేట్ చేయ‌డం మ‌నం చూడొచ్చు. అలా రోహిత్ త‌న‌దైన శైలిలో వారిని ఇమిటేట్ చేసి న‌వ్వులు పూయించాడు. ప్ర‌స్తుతం ఐపీఎల్ టోర్నీలో బిజీగా ఉన్న హిట్‌మ్యాన్‌.. ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా ఇలా కొద్దిసేపు స‌ర‌దాగా గ‌డిపాడు. 

ఇక వీడియోలో ఈ స్టార్ క్రికెట‌ర్ భార‌త‌ దిగ్గజం, మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్‌ సచిన్ టెండూల్కర్, మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్‌ల బ్యాటింగ్ శైలిని అనుక‌రించాడు. సచిన్ స్ట్రెయిట్ డ్రైవ్, ద్రవిడ్ సిగ్నేచర్ బ్యాటింగ్ స్టాండ్‌ను రోహిత్ దింపేశాడు. అలాగే యువరాజ్ సింగ్ స్టైల్‌లో హావభావాలు పలికించ‌డం మ‌రో హైలైట్. సేమ్ టు సేమ్ యువీలానే చేశాడు. వీరితో పాటు భార‌త‌ మాజీ బౌలర్లు జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్‌ల‌ను అనుక‌రిస్తూ బౌలింగ్ చేశాడు. 

ఇలా మొత్తంగా 38 సెకన్ల నిడివి క‌లిగిన ఈ వీడియోలో భజ్జీ బౌలింగ్ యాక్షన్,  ద్రవిడ్ సిగ్నేచర్ బ్యాటింగ్ స్టాండ్,  సచిన్ స్ట్రెయిట్ డ్రైవ్, యువీ ఫీల్డింగ్ ఫీట్లు, జహీర్ సెలబ్రేషన్స్‌ను హిట్‌మ్యాన్‌ చూపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైరల్ అవుతోంది.
Rohit Sharma
Sachin Tendulkar
Indian Cricketers
Cricket
Viral Videos

More Telugu News