IAS: ఏపీలో ఇటీవల బదిలీ చేసిన ఐఏఎస్ లకు పోస్టింగులు

AP Govt allots postings to recently transferred IAS officials
  • ఏపీలో ఇటీవల పలువురు ఐఏఎస్ లకు స్థానచలనం
  • ఎన్నికలతో సంబంధం లేని విధులు కేటాయించాలన్న ఈసీ
  • ఈసీ ఆదేశాల మేరకు పోస్టింగులు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
ఏపీలో ఇటీవల పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి, కృష్ణా జిల్లా కలెక్టర్ రాజబాబులకు ఈసీ ఆదేశాలతో స్థాన చలనం కలిగింది. 

ఇప్పుడు ఆ ముగ్గురికీ ఎన్నికలతో సంబంధం లేని విధులు కేటాయించాలని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈసీ ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం విధులు కేటాయించింది. లక్ష్మీషాను ఆరోగ్య శ్రీ ట్రస్టు సీఈవోగా నియమించింది. గౌతమిని టీటీడీ జేఈవోగా, రాజబాబును స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీగా నియమించింది. 

పలువురు ఇతర ఐఏఎస్ లను కూడా వివిధ పదవుల్లో  నియమించింది. మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ గా అంబేద్కర్ ను, పౌరసరఫరాల కార్పొరేషన్ ఎండీగా వెంకట్రామిరెడ్డిని, సీసీఎల్ఏ కార్యదర్శిగా ప్రభాకర్ రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు.
IAS
Transfer
EC
Andhra Pradesh

More Telugu News