Chiranjeevi: జనసేన పార్టీకి రూ.5 కోట్ల విరాళం ఇవ్వడంపై చిరంజీవి స్పందన

Chiranjeevi opines on donated huge amount to Janasena Party
  • జనసేన పార్టీకి చిరంజీవి భారీ విరాళం
  • రూ.5 కోట్ల చెక్ ను పవన్ కల్యాణ్ కు అందించిన చిరంజీవి
  • అధికారంలో లేకపోయినా పవన్ సాయం చేస్తున్న తీరు ఆకట్టుకుందన్న మెగాస్టార్
  • అందుకే నేను సైతం అంటూ జనసేనకు విరాళం ఇచ్చానని వెల్లడి
జనసేన పార్టీకి ఏకమొత్తంలో రూ.5 కోట్ల భారీ విరాళం ఇవ్వడం పట్ల మెగాస్టార్ చిరంజీవిపై అభిమాన వర్గాల్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై చిరంజీవి స్పందించారు. తమ్ముడి పట్ల తన ప్రేమను వ్యక్తపరిచారు.

"అందరూ అధికారంలోకి వచ్చిన తర్వాత సాయం చేస్తాం అంటారు. కానీ, అధికారంలోకి లేకపోయినా తన సంపాదనను రైతు కూలీల కోసం పవన్ కల్యాణ్ వినియోగించడం నాకు సంతోషాన్ని కలిగించింది. తన స్వార్జితాన్ని సమాజం కోసం ఖర్చు పెట్టే మనసున్న తమ్ముడు పవన్ కల్యాణ్ లక్ష్యానికి కొంతైనా సాయపడుతుందని నేను సైతం జనసేనకు విరాళం అందించాను" అని చిరంజీవి సోషల్ మీడియాలో వివరించారు.
Chiranjeevi
Pawan Kalyan
Janasena
Donation

More Telugu News