Komatireddy Raj Gopal Reddy: భువనగిరి లోక్ సభ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజ్ఞప్తి

Komatireddy Rajagopal Reddy appeals to vote chamala kiran kumar reddy
  • పేదలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో 6 గ్యారెంటీ పథకాలతో ముందుకు సాగుతున్నామని వెల్లడి
  • ఆరు గ్యారెంటీలలో పేదలు, రైతులు, యువకులు, మహిళల కోసం ప్రాధాన్యత ఇచ్చినట్లు వెల్లడి
  • కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకుందామన్న కోమటిరెడ్డి

తెలంగాణ ఇచ్చాక, కాంగ్రెస్ ఇప్పుడు (ఇన్నాళ్లకు) అధికారంలోకి వచ్చిందని... పేదలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో 6 గ్యారెంటీ పథకాలతో ముందుకు సాగుతున్నామని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆరు గ్యారెంటీలలో పేదలు,  రైతులు, యువకులు, మహిళల కోసం ప్రాధాన్యతనిచ్చి వాటిని విడతలవారీగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. భువనగిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... యువకుడిగా ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డిని అధిష్ఠానం అభ్యర్థిగా ప్రకటించిందన్నారు.

అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉందని... తెలంగాణ ఇచ్చిన తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చామన్నారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన వారంతా యువకుడైన కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకుందామన్నారు.

  • Loading...

More Telugu News