G. Kishan Reddy: జూన్ 8 లేదా 9న మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేస్తారు: కిషన్ రెడ్డి

  • దేశ అభివృద్ధి, సమైక్యత కోసం బీజేపీకి ఓటు వేయాలని పిలుపు
  • ప్రధాని మోదీ వచ్చాక మత కలహాలు, కర్ఫ్యూలు లేవని వ్యాఖ్య
  • కాంగ్రెస్ హయాంలో  అన్నీ దిగుమతు చేసుకునే వాళ్లమన్న కిషన్ రెడ్డి
  • ప్రస్తుతం మనమే విదేశాలకు ఎగుమతి చేసేస్థాయికి ఎదిగామని వ్యాఖ్య
Kishan Reddy take oath as PM third time

జూన్ 8న లేదా 9న నరేంద్రమోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గ బీజేపీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... దేశ అభివృద్ధి, సమైక్యత కోసం బీజేపీకి ఓటు వేయాలన్నారు. ప్రధాని మోదీ వచ్చాక మత కలహాలు, కర్ఫ్యూలు లేవన్నారు. కాంగ్రెస్ హయాంలో  అన్నీ దిగుమతి చేసుకునే వాళ్లమని, ప్రస్తుతం మనమే విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామన్నారు. కాంగ్రెస్ హయాంలో అన్ని రంగాల్లో అవినీతి జరిగిందన్నారు.

మోదీ కంటే ముందు కాంగ్రెస్ పార్టీ పదేళ్లు దేశాన్ని పాలించిందని... వారి పాలనలో కామన్వెల్త్ గేమ్స్, 2జీ స్పెక్ట్రం, హెలికాప్టర్... ఇలా అన్నీ కుంభకోణాలే జరిగాయన్నారు. వీటి ద్వారా లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు. కానీ మోదీ పదేళ్ల కాలంలో నీతిమంతమైన పాలన ప్రజలకు అందిందన్నారు. మోదీ కేబినెట్లో ఒక్క మంత్రికి అవినీతి మరక అంటలేదన్నారు. బీజేపీ పుట్టిందే ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా అన్నారు. తమకు అధికారం ఇస్తే దీనిని రద్దు చేస్తామని ప్రతి ఎన్నికల్లో చెప్పామన్నారు. జమ్మూ కశ్మీర్‌లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోన్న చరిత్ర మోదీ ప్రభుత్వానిదని అన్నారు.

More Telugu News