Rohit Ritika: టీమిండియాకే నేను కెప్టెన్, ఇంట్లో మా ఆవిడే..: రోహిత్ శర్మ

Rohit Sharma On Why He Can not Disobey Wife Ritika Sajdeh
  • కపిల్ శర్మ టీవీ షో ఇంటర్వ్యూలో నవ్వులు పూయించిన క్రికెటర్
  • తను మైదానంలోకి రాదు కానీ నేను ఇంట్లో అడుగుపెట్టాల్సిందేనన్న రోహిత్  
  • అందుకే ఇంట్లో ఆవిడ ఏంచెప్పినా ఊ కొట్టాల్సిందేనంటూ ఫన్నీ జవాబు
టీమిండియాలో అందరూ తన మాట వింటారు కానీ తాను మాత్రం ఇంట్లో భార్య మాట వినాల్సిందేనని రోహిత్ శర్మ సరదా కామెంట్ చేశాడు. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’లో ఇటీవల తన భార్య రితికాతో కలిసి ఆయన పాల్గొన్నాడు. ఈ షోలో కపిల్ అడిగిన పలు ప్రశ్నలకు ఫన్నీగా జవాబిస్తూ అక్కడున్న ఆడియన్స్ తో పాటు టీవీల ముందు కూర్చున్న వారినీ నవ్వించాడు. టీమిండియాకు మాత్రమే తాను కెప్టెన్ అని మరోసారి చెప్పిన రోహిత్.. ఇంట్లో తన భార్య రితికానే కెప్టెన్ అని, అందుకే ఏదైనా చెబితే కాదనేందుకు ధైర్యం చాలదని అన్నాడు. ‘మా ఆవిడ మైదానంలోకి రాదు.. డ్రెస్సింగ్ రూంలోకి అడుగుపెట్టదు.. కానీ మ్యాచ్ అయిపోయాక నేను మాత్రం ఇంట్లో అడుగుపెట్టక తప్పదు’ అంటూ ఆడియన్స్ లో రోహిత్ నవ్వులు పూయించాడు.

జట్టు సభ్యులతో సీరియస్ గా చర్చించేటపుడు చాలా విషయాల ప్రస్తావన వస్తుందని చెప్పాడు. జట్టు సభ్యులతో మాట్లాడేటప్పుడు తరచూ తాను వారిని హెచ్చరిస్తానని, స్టేడియంలోని ఆడియన్స్ లో మీ గర్ల్ ఫ్రెండ్ ఉండొచ్చు కానీ ఈ మ్యాచ్ అయిపోయేంత వరకూ ఇంట్లో మా ఆవిడ టీవీ ముందే కూర్చుని ఉంటుందని, తనే నాకు ముఖ్యమని చెబుతానన్నాడు. ఈ క్రమంలోనే ఆ షోకు హాజరైన రోహిత్ భార్య రితికాకు కూడా కపిల్ పలు ప్రశ్నలు సంధించాడు. భర్తగా.. కెప్టెన్ గా.. రోహిత్ ను హ్యాండిల్ చేయడం ఏ పాత్రలో కష్టం అని అడగగా.. భర్తగానే అని రితికా జవాబిచ్చారు. కెప్టెన్ గా ఆయనను చూసుకోవడానికి (హ్యాండిల్ చేయడానికి) పదకొండు మంది ఉంటారు. దాంతో తనకు సంబంధం లేదని, భర్తగా రోహిత్ ను హ్యాండిల్ చేయడమే కష్టమని రితికా చెప్పారు.
Rohit Ritika
Team India Captain
Cricket
Rohit Sharma
Kapil Show

More Telugu News