మరోమారు అనారోగ్యానికి గురైన పవన్ కల్యాణ్.. పర్యటన మళ్లీ రద్దు
- ఇటీవల జ్వరం బారినపడిన పవన్ కల్యాణ్
- రెండు రోజుల విశ్రాంతి అనంతరం నిన్న అనకాపల్లిలో పర్యటన
- మరోమారు జ్వరం రావడంతో నేటి యలమంచిలి పర్యటన రద్దు
ఇటీవల ఆయన జ్వరం బారినపడడంతో రెండు రోజులపాటు పర్యటనను రద్దుచేసుకుని నిన్నటి నుంచి వారాహి యాత్రను తిరిగి ప్రారంభించారు. ఈ క్రమంలో అనకాపల్లిలో ఏర్పాటుచేసిన సభలో మాట్లాడిన అనంతరం పవన్ మళ్లీ జ్వరం బారినపడ్డారు. దీంతో నేటి పర్యటనను రద్దుచేసుకున్నారు. కాగా, ఈ నెల తొలివారంలో పవన్ తెనాలి పర్యటన కూడా రద్దయింది.