Rajinikanth: అక్టోబర్‌లో రానున్న రజినీకాంత్ ‘వేట్టయాన్'

Rajinikanth new movie Vettaiyan coming this October
  • టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీ కొత్తచిత్రం వేట్టయాన్
  • చిత్ర బృందం నుంచి తాజా అప్ డేట్
  • వేట్టయాన్ పై భారీ అంచనాలు  
సూపర్ స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో జై భీమ్ ఫేమ్ టీ.జే. జ్ఞానవేల్‌ దర్శకత్వంలో ‘వేట్టయాన్’ అనే సినిమా రాబోతోంది. ప్యాన్ ఇండియన్ రేంజ్‌లో ఎన్నో ప్రముఖ చిత్రాలను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ వంటి హేమాహేమీలు నటిస్తుండడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. 

తాజాగా ఈ చిత్రం నుంచి ఓ అప్ డేట్ ఇచ్చారు. వేట్టయాన్ మూవీని ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదల చేయబోతోన్నట్టుగా ప్రకటించారు. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. 

ఈ పోస్టర్‌లో రజినీ స్టైల్, ఆ నవ్వు, ఆ గన్ను పట్టిన విధానం, ఆ హెయిర్ స్టైల్ అన్నీ కూడా అభిమానులను మెప్పించేలా ఉన్నాయి. ఇక ఈ చిత్రం అక్టోబర్‌లో విడుదల కానుందని ప్రకటించడంతో దసరా పోటీ రసవత్తరంగా మారేట్టు కనిపిస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. 

ఇందులో రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, కిశోర్, రితికా సింగ్, దుషార విజయన్,  జీఎం సుందర్, రోహిణి, అభిరామి, రావు రమేశ్, రమేశ్ తిలక్, రక్షణ, సాబుమోన్ అబుసమద్, సుప్రీత్ రెడ్డి తదితరులు నటిస్తున్నారు.
Rajinikanth
Vettaiyan
October
Kollywood

More Telugu News