TDP-JanaSena-BJP Alliance: మరోసారి చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం... ఎప్పటి నుంచి అంటే...!

Chandrababu and Pawan Kalyan wil campaign jointly again
  • ఏపీలో మే 13న ఎన్నికలు
  • ప్రచార జోరు కొనసాగిస్తున్న ప్రధాన పార్టీలు
  • ప్రజాగళం మూడో విడతలో కలిసి ప్రచారం చేయనున్న చంద్రబాబు, పవన్
ఏపీలో మే 13న ఎన్నికలు జరగనుండగా, ప్రధాన పార్టీలన్నీ ప్రచార జోరు కొనసాగిస్తున్నాయి. ఓవైపు సీఎం జగన్, మరోవైపు చంద్రబాబు ప్రచారంలో ముందుకెళుతున్నారు. నేడు జనసేనాని పవన్ కల్యాణ్ కూడా అనకాపల్లి సభ ద్వారా మళ్లీ ప్రచార బరిలోకి దిగనున్నారు. 

ఏపీలో పొత్తు నేపథ్యంలో, మరోసారి ఉమ్మడిగా ప్రచారం చేయాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిర్ణయించారు. వీరిద్దరూ ఉభయ గోదావరి జిల్లాల్లో కలిసి ప్రచారంలో పాల్గొననున్నారు. 

ప్రజాగళం మూడో విడతలో భాగంగా... చంద్రబాబు, పవన్ ఏప్రిల్ 10, 11 తేదీల్లో కలిసి ప్రచారం చేయనున్నారు. ఈ నెల 10న తణుకు, నిడదవోలులో జరిగే సభల్లో పాల్గొంటారు. ఈ నెల 11న పి.గన్నవరం, అమలాపురంలో ఉమ్మడిగా ప్రచారం చేస్తారు.
TDP-JanaSena-BJP Alliance
Chandrababu
Pawan Kalyan
TDP
Janasena

More Telugu News