Pawan Kalyan: అనకాపల్లి చేరుకున్న జనసేనాని పవన్ కల్యాణ్

Pawan Kalyan arrives Anakapalle
  • అనకాపల్లిలో ఈ సాయంత్రం వారాహి విజయభేరి సభ
  • హాజరుకానున్న పవన్ కల్యాణ్
  • పవన్ కు స్వాగతం పలికిన కొణతాల, సీఎం రమేశ్, బుద్ధా నాగజగదీశ్వరరావు
పవన్ కల్యాణ్ నేటి నుంచి జనసేన ఎన్నికల ప్రచారాన్ని తిరిగి కొనసాగించనున్నారు. ఈ సాయంత్రం అనకాపల్లి సభలో పాల్గొననున్నారు. కొద్దిసేపటి కిందట పవన్ హెలికాప్టర్లో అనకాపల్లి చేరుకున్నారు. ఆయనకు జనసేన నేత కొణతాల రామకృష్ణ, అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్, జిల్లా టీడీపీ ఇన్చార్జి బుద్ధా నాగజగదీశ్వరరావు తదితరులు స్వాగతం పలికారు. కాగా, ఈ సాయంత్రం 5 గంటలకు అనకాపల్లి నెహ్రూ చౌక్ జంక్షన్ లో పవన్ కల్యాణ్ వారాహి విజయభేరి సభకు హాజరుకానున్నారు. 

రేపు (ఏప్రిల్ 8) పవన్ ఎలమంచిలిలో జరిగే విజయభేరి సభకు హాజరవుతారు. ఎల్లుండి (ఏప్రిల్ 9) పిఠాపురంలో ఉగాది వేడుకల్లో పాల్గొంటారు.
Pawan Kalyan
Anakapalle
Varahi Vijayabheri
Janasena
TDP-JanaSena-BJP Alliance

More Telugu News