KCR: కేసీఆర్‌పై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు

PCC Vice President Niranjan Complaint against KCR to Election Commission
  • సిరిసిల్లలో కేసీఆర్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆరోపణ
  • ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ నాయకులను దూషిస్తూ వాడిన భాష ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని ఫిర్యాదు
  • వివిధ వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల క్లిప్పింగ్‌ను జోడించిన పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుపై చర్యలు తీసుకోవాలంటూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ నిన్న కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కేసీఆర్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని పేర్కొన్నారు. 

సిరిసిల్లలో ఎండిన పంటలు పరిశీలించిన అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ నాయకులను ఆయన దూషించారని, ఈ సందర్భంగా వాడిన భాష ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిపారు. ఫిర్యాదును సమర్థిస్తూ వివిధ పత్రికల్లో వచ్చిన కథనాల క్లిప్పింగ్‌లను లేఖకు జోడించారు.
KCR
G.Niranjan
PCC
Election Commission
BRS
Congress

More Telugu News