Congress: శంషాబాద్ విమానాశ్రయంలో రాహుల్ గాంధీకి స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి

Rahul Gandhi reaches hyderabad for thukkuguda public meeting
  • తుక్కుగూడలో కాంగ్రెస్ జన జాతర సభ
  • సభలో మేనిఫెస్టోను విడుదల చేయనున్న రాహుల్ గాంధీ
  • జన జాతర సభ సందర్భంగా పలువురు బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరే అవకాశం

ఏఐసీసీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి శంషాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. తుక్కుగూడలో నిర్వహించనున్న 'జన జాతర' సభలో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చారు. రాహుల్ గాంధీతో కలిసి రేవంత్ రెడ్డి, ఇతర నేతలు విమానాశ్రయం నుంచి తుక్కుగూడకు బయలుదేరారు. 

ఈ సభ కోసం కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున జనసమీకరణ చేసింది. పది లక్షలమంది సభకు వస్తారని అంచనా వేసింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తుక్కుగూడ సభను కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తుక్కుగూడ జనసంద్రంగా మారింది.

తుక్కుగూడ సభలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. మేనిఫెస్టోలో 25 అంశాలు ఉండనుండగా... ఇందులో 23 తెలంగాణకు సంబంధించిన అంశాలు ఉంటాయని తెలుస్తోంది. జన జాతర సభ సందర్భంగా పలువురు బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని తెలుస్తోంది. ఇప్పటికే జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో కార్పోరేటర్లపై కూడా అధికార పార్టీ దృష్టి సారించింది.

  • Loading...

More Telugu News