Viral Video: గంగిరెద్దు దాడి.. త్రుటిలో తప్పిన ప్రాణాపాయం.. వీడియో వైర‌ల్‌!

Shocking Incident in Bengaluru Video goes Viral on Social Media
  • బెంగళూరులో షాకింగ్ ఘ‌ట‌న‌
  • రోడ్డుపై వెళ్తున్న వాహ‌న‌దారుడిపై ఉన్న‌ట్టుండి గంగిరెద్దు దాడి
  • ఈ ప్ర‌మాదం తాలూకు వీడియో నెట్టింట‌ వైర‌ల్ 
రోడ్డుపై వెళ్తున్న‌ప్పుడు ప్ర‌మాదం ఏ వైపు నుంచి ముంచుకొస్తుందో చెప్ప‌లేం. మ‌న రూట్‌లో మ‌నం క‌రెక్టుగా వెళ్తున్న ఒక్కొసారి ఊహించ‌ని ప్ర‌మాదాలు జ‌రుగుతుంటాయి. ఇదే కోవ‌కు చెందిన ఓ ప్ర‌మాదం ఇటీవ‌ల క‌ర్ణాట‌క‌ రాజ‌ధాని బెంగళూరులో చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదం తాలూకు వీడియో ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. 

బెంగ‌ళూరులోని మహాలక్ష్మి లేఔట్‌లో స్కూటీపై వెళ్తున్న వ్యక్తిపై ఉన్న‌ట్టుండి గంగిరెద్దు దాడి చేసింది. దీంతో అత‌ను కింద ప‌డిపోగా, అదే స‌మ‌యంలో ప‌క్క‌నే లారీ వ‌చ్చింది. అయితే, లారీ డ్రైవ‌ర్ చాకచక్యంగా బ్రేక్ వేయడంతో ఆ ద్విచ‌క్ర వాహ‌న‌దారుడికి ప్రాణాపాయం త‌ప్పింది. లేదంటే లారీ టైర్ల కింద న‌లిగిపోయేవాడు. 

ఈ షాకింగ్‌ ఘ‌ట‌న తాలూకు దృశ్యాలు అక్క‌డి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఇప్పుడు ఆ వీడియో కాస్త బ‌య‌ట‌కు రావ‌డంతో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు రోడ్డుపై జంతువులు వ‌స్తున్న‌ప్పుడు వాహ‌న‌దారులు మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచిస్తున్నారు. 


Viral Video
Bengaluru
Shocking Incident
Karnataka
Social Media

More Telugu News