IPL 2024: ముంబై ఇండియ‌న్స్ ప్లేయర్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి!

Mumbai Indians Squad Jet Skiing ahead of Delhi Capitals Match
  • జెట్‌-స్కీయింగ్ చేస్తూ స‌ర‌దాగా గ‌డిపిన ముంబై ఆట‌గాళ్లు
  • మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, హార్దిక్ పాండ్యా, టీమ్ డేవిడ్‌తో పాటు మ‌రికొంత మంది ఆట‌గాళ్ల స‌ర‌దా ఆట‌లు
  • ముంబై ప్లేయ‌ర్స్ మధ్య విభేదాలు ఉన్నాయ‌నే రూమ‌ర్ల‌కు ఈ వీడియో చ‌క్క‌టి స‌మ‌ధానం అంటున్న‌ నెటిజ‌న్లు 
  • ఈ నెల 7వ తేదీన డీసీతో త‌ల‌ప‌డ‌నున్న ముంబై
ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ (ఎంఐ) ఘోరంగా విఫ‌లం అవుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన 3 మ్యాచుల్లోనూ ఆ జ‌ట్టు ఓట‌మి చ‌విచూసింది. దీంతో ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో అట్ట‌డుగు స్థానంలో ఉంది. మ‌రోవైపు ఎంఐ  కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా జ‌ట్టును స‌రైన మార్గంలో న‌డిపించ‌లేక‌పోతున్నాడ‌ని విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా ఆట‌గాళ్ల మ‌ధ్య సయోధ్య కుద‌ర్చ‌డం, వారిని క‌లుపుకుని వెళ్ల‌డంలో పాండ్యా పూర్తిగా విఫ‌లం అవుతున్నాడ‌నేది క్రికెట్ విశ్లేష‌కుల అభిప్రాయం. 

ఇది అత‌ని కెప్టెన్సీపై తీవ్ర ప్ర‌భావం చూపుతున్న‌ట్లు చెబుతున్నారు. ఇక వ‌రుస ప‌రాజ‌యాల‌తో డీలాప‌డ్డ ముంబై ఆట‌గాళ్లు గురువారం జెట్‌-స్కీయింగ్ చేస్తూ సేద తీరారు. ఢిల్లీ క్యాపిట‌ల్స్ (డీసీ) తో మ్యాచుకు ముందు ఇలా ఎంఐ ప్లేయ‌ర్లు ఎంజాయ్ చేస్తూ క‌నిపించారు. మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, హార్దిక్ పాండ్యా, టీమ్ డేవిడ్‌తో పాటు మ‌రికొంత మంది ఆట‌గాళ్లు ఇలా జెట్‌-స్కీయింగ్‌తో పాటు ఇత‌ర స‌ర‌దా ఆట‌ల‌తో ఎంజాయ్ చేశారు. ముంబై ప్లేయ‌ర్స్ మధ్య విభేదాలు ఉన్నాయ‌నే రూమ‌ర్ల‌కు ఈ వీడియో చ‌క్క‌టి స‌మ‌ధానం అని నెటిజ‌న్లు అంటున్నారు. కాగా, ఈ నెల 7వ తేదీన డీసీతో ముంబై త‌ల‌ప‌డ‌నుంది.
IPL 2024
Mumbai Indians
Jet Skiing
Delhi Capitals
Sports News
Cricket

More Telugu News